Vijay: తొలి బహిరంగ సభలోనే పవర్‌ఫుల్‌ స్పీచ్‌.. NTR పేరు ప్రస్తావన

by Mahesh |   ( Updated:2024-10-27 14:41:44.0  )
Vijay: తొలి బహిరంగ సభలోనే పవర్‌ఫుల్‌ స్పీచ్‌.. NTR పేరు ప్రస్తావన
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో జోసెఫ్ విజయ్(vijay) రాజకీయాల్లోకి ఆడుగుపెట్టారు. ఈ క్రమంలోనే గతంలో తమిళ వెట్రి కజగం(Tamil Vetri Kazhagam) పార్టీనీ ఏర్పాటు చేసిన ఆయన.. ఆ పార్టీ తొలి సభను మహానాడు(TVK Mahanadu)లో ఏర్పాటు చేశాడు. ఆ సభకు లక్షలాది మంది హాజరవ్వగా.. వారిని చూసిన విజయ్ ఆనందం తో ఊగిపోయాడు. ఈ సందర్భంగా తన తొలి సభలో విజయ్(Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు పాము లాంటివని అన్నారు. అలాగే తన పార్టీలో అందరూ సమానమేనని, అందరికీ తగిన ప్రతిఫలం లభిస్తుంది అని తమిళ రాజకీయాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే తాను పార్టీ పెట్టినప్పటుడు తనను చాలా రకాలుగా విమర్శించారని గుర్తు చేసుకున్నారు.

ముఖానికి రంగులు వేసుకునే వారికి రాజకీయాలు ఎందుకంని విమర్శించిన వారికి TVK చీఫ్ విజయ్ తన తొలి సభలోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ తమిళనాడులు రాజకీయాలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్(NTR), ఎంజీఆర్(MGR) కూడా సినిమాల నుంచి వచ్చినవారే నని, వారు రాజకీయాల్లో ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. అలాగే తన కెరీర్ పీక్ లో ఉండగానే.. సినిమాలు వదిలేసి మీ అందరి కోసం రాజకీయాల్లోకి వచ్చి మీ ముందు ఇక్కడ మీ విజయ గా వచ్చి నిలబడ్డానని.. నన్ను ఆశీర్వదించండి.. అంటూ కోరాడు.

Advertisement

Next Story

Most Viewed