- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి పౌరస్మృతి అమలును పరిశీలిస్తున్నాం
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. శివమొగ్గ జిల్లాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'దేశ స్థాయిలో బీజేపీ ప్రధాన మేనిఫెస్టో పాయింట్లలో ఒకటైన యూనిఫాం సివిల్ కోడ్ గురించి మేము చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాము. ఇప్పటికే దీనికి సంబంధించి పలు రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటయ్యాయి.
దీనిని అమలును నిశితంగా పరిశీలిస్తూ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు' అని చెప్పారు. ఓటర్ల మార్పులు చేర్పులు వివాదంపై బొమ్మై స్పందిస్తూ.. దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని అన్నారు. అవినీతికి పాల్పడ్డ ఏ అధికారిని విడిచిపెట్టమని తెలిపారు. ఇప్పటికే ఇద్దరు ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేశామన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు.