Indian Students : ట్రంప్ కుర్చీ ఎక్కకముందే వచ్చేయండి.. భారత విద్యార్థులకు అమెరికా వర్సిటీల అడ్వైజరీ

by Hajipasha |
Indian Students : ట్రంప్ కుర్చీ ఎక్కకముందే వచ్చేయండి.. భారత విద్యార్థులకు అమెరికా వర్సిటీల అడ్వైజరీ
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత్(Indian Students) సహా పలు దేశాల విద్యార్థులకు పలు ప్రముఖ అమెరికా యూనివర్సిటీలు(US Universities) ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Trump) బాధ్యతలు చేపట్టాక ట్రావెల్ బ్యాన్ అమల్లోకి వస్తుందని విదేశీ విద్యార్థులు(foreign students) ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో అమెరికా వర్సిటీలు కీలక సందేశాలను విడుదల చేశాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి (జనవరి 20వ తేదీకి) ముందే.. అమెరికాకు తిరిగి వచ్చేయాలని విదేశీ విద్యార్థులను కోరాయి.

డొనాల్డ్ ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. 2017లో ఏడు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాకు రాకపోకలు సాగించడంపై బ్యాన్ విధించారు. అదే తరహా ప్రకటనను ఈసారి కూడా ట్రంప్ చేసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నందున ఈ అడ్వైజరీని జారీ చేస్తున్నామని అమ్‌హెరస్ట్ నగరంలో ఉన్న మసాచుసెట్స్ యూనివర్సిటీ తెలిపింది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక వీసా ప్రక్రియ క్లిష్టతరం అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ‘‘జనవరి 19కల్లా తప్పకుండా అమెరికాలో ఉండండి’’ అని వెస్లీయన్ యూనివర్సిటీ తమ విదేశీ విద్యార్థులకు సూచించింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు (3.31 లక్షల మంది) భారత్ నుంచి వెళ్లినవారే. రెండో స్థానంలో చైనా ఉంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed