- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Democracy: ప్రజాస్వామ్యం తిండిపెట్టదన్న వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం (Global democracy) ప్రమాదంలో ఉందనే వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి జైశంకర్(S Jaishankar) ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తున్న పశ్చిమ దేశాలపై కౌంటర్ ఇచ్చారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జైశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యం కష్టాల్లో కూరుకుపోయిందా అని అడిగిన ప్రశ్నపై ప్రసంగించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఉన్న తామంతా అద్భుతంగా జీవిస్తున్నామని.. ఓటింగ్‌లోనూ పాల్గొంటున్నామని పేర్కొన్నారు. దీనికి గుర్తుగా ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. తన వేలికి ఉన్న సిరా చుక్కను కూడా చూపించారు. ప్రజాస్వామ్యంపై ఆశావాదంతో జీవిస్తున్నామన్నారు. భారత ఎన్నికల ప్రక్రియపై తనకు విశ్వాసం ఉందని అన్నారు. అంతేకాకుండా, భారత్ లో ఎన్నికల ఫలితాలు విడదలైన తర్వాత ఎలాంటి వివాదాలు ఉండవన్నారు.
అమెరికా సెనెటర్ కు కౌంటర్
అయితే, ప్రజాస్వామ్యం తిండిపెట్టదు.. మన అవసరాలు తీర్చదన్న అమెరికా సెనెటర్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో దాదాపు 800 మిలియన్ల మందికి పోషకాహార సహాయాన్ని అందిస్తోందని అన్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం సమర్థంగా పనిచేస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో సవాళ్లు ఎదుర్కొంటామనే విషయాన్ని అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో దీన్ని ఒకే విధంగా పరిగణలోకి తీసుకోవద్దన్నారు.ప్రజాస్వామ్యాన్ని పాశ్చాత్య లక్షణంగా పరిగణించిన పశ్చిమ దేశాలు.. గ్లోబల్ సౌత్‌లో ప్రజాస్వామ్యేతర శక్తులను ప్రోత్సహించడంలో బిజీగా ఉన్నారని విమర్శలు గుప్పించారు. కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. భారత్ బలమైన ప్రజాస్వామ్య దేశమని జైశంకర్ అన్నారు. దేశంలో రాజకీయ నిరాశావాదం ప్రబలంగా ఉందన్న వాదనలను ఆయన ఖండించారు. దేశంలో జరుగుతున్న ఎన్నికలపై విదేశీ జోక్యం గురించి కూడా ప్రస్తావించారు. ఇకపోతే, ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు జర్మనీలోని మ్యూనిచ్‌లో 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC) జరుగుతోంది. అందులో భాగంగానే కాన్ఫెరన్స్ లో జైశంకర్ ప్రసంగించారు.