- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gautam Adani : ‘అదానీ’పై కేసు వాదించిన అమెరికా అటార్నీ జనరల్ రాజీనామా
దిశ, నేషనల్ బ్యూరో : అదానీ గ్రూపున(Gautam Adani)కు వ్యతిరేకంగా నమోదైన కేసులను వాదించిన అమెరికా ప్రభుత్వం తరఫు న్యాయవాది(US attorney) బ్రియాన్ పీస్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా జనవరి 10 నుంచి అమల్లోకి రానుంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక 2021 అక్టోబరు 15న బ్రియాన్ పీస్‌ను న్యూయార్క్ రాష్ట్రం పరిధిలో ఉన్న బ్రూక్లిన్ కౌంటీకి అటార్నీ జనరల్‌గా వ్యవహరించారు. జనవరి 19వ తేదీతో జో బైడెన్ పదవీ కాలం ముగియనుంది. ఈ కారణం వల్లే బ్రియాన్ పీస్ కూడా రాజీనామా ప్రకటించారు. అదానీ గ్రూపు ముడుపుల వ్యవహారంతో పాటు మరెన్నో హైప్రొఫైల్ కేసుల్లో అమెరికా సర్కారు తరఫున వాదనలు వినిపించిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం.
భారత్‌లోని పలు రాష్ట్రాల్లో సోలార్ పవర్ కాంట్రాక్టులను పొందేందుకు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు అదానీ గ్రూపు ముడుపులు ముట్టజెప్పిందనే అభియోగాలతో నవంబరులో అమెరికాలోని న్యూయార్క్ కోర్టు(New York court)లో కేసులు నమోదయ్యాయి. అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ, ఆయన బంధువు ఒకరు కలిసి 2020 నుంచి 2024 మధ్యకాలంలో రూ.2,029 కోట్ల ముడుపులను ఇచ్చారనే అభియోగాలను నమోదు చేశారు. అయితే ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవని అదానీ గ్రూపు ఖండించింది. విదేశాల్లో నమోదైన కేసులపై భారత్‌లో విచారణ జరపలేమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.