- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి
దిశ, వెబ్ డెస్క్: కోల్కతాలో కేంద్రమంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. శనివారం కోల్కతాలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ కాన్వాయ్ ని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు దుండగులపై భాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు. కేంద్ర మంత్రి నిషిత్ ప్రమాణిక్ తనపై తృణమూల్ కార్యకర్తలు చేసిన దాడిపై మండిపడ్డారు. ఓ కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందో ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికుల కాల్పుల్లో ఇటీవల ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తి చనిపోగా.. అందుకు నిరసనగానే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నట్లు టీఎంసీ నాయకులు చెబుతున్నారు.