Amit Shah : ‘భారతీయ భాషా అనుభాగ్‌’‌ ప్రారంభోత్సవానికి వేళాయె..

by Hajipasha |
Amit Shah : ‘భారతీయ భాషా అనుభాగ్‌’‌ ప్రారంభోత్సవానికి వేళాయె..
X

దిశ, నేషనల్ బ్యూరో : హిందీ మన దేశ అధికార భాషగా అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘భారతీయ భాషా అనుభాగ్’ విభాగాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం (సెప్టెంబరు 14న) ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికార భాషా విభాగం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న అధికార భాష డైమండ్ జూబ్లీ వేడుకల వేదికగా ‘భారతీయ భాషా అనుభాగ్’ విభాగాన్ని హోంమంత్రి ఆవిష్కరించనున్నారు.

హిందీతో ఇతర భారతీయ భాషలకు సమన్వయాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఈ కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంపును అమిత్‌షా విడుదల చేయనున్నారు. భాషా రంగంలో సేవలు అందిస్తున్న పలువురికి రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి అవార్డులను ప్రదానం చేస్తారు. ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో 10వేల మందికిపైగా పాల్గొంటారని అంచనా. హిందీ స్కాలర్లు, కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఉద్యోగులు, దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న రాజ్ భాషా అధికారులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు.

Advertisement

Next Story

Most Viewed