- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షా అత్యవసర మీటింగ్.. ఎవరితోనో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ సంక్షోభం నెలకొన్న బంగ్లాదేశ్‌లో ఆర్మీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని ఏలిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినా ఆందోళనలు తగ్గకపోవడంతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు.
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై వారింతో అమిత్ షా చర్చించారు. భారత్, బంగ్లా బోర్డర్‌లో భద్రత పెంపు, ఢిల్లీలో షేక్ హసీనా భద్రత, బంగ్లా నుంచి వలసలు వంటి వాటిపై చర్చలు జరిపారు. కాగా, రిజర్వేషన్ల వివాదంతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. చిన్నగా మొదలైన ఘర్షణ పెరిగి పెద్దదై సంక్షోభంగా మారింది. అల్లర్లు, దాడులు జరిగాయి. చివరికి ఆ ఆదేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి ఇండియాలో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరుగుదేశంలో నెలకున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.