Union Budget-2024: ఇదొక ‘కుర్సీ బచావో’ బడ్జెట్.. రాహుల్‌గాంధీ సంచలన ట్వీట్

by Shiva |   ( Updated:2024-07-23 17:32:58.0  )
Union Budget-2024: ఇదొక ‘కుర్సీ బచావో’ బడ్జెట్.. రాహుల్‌గాంధీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మూడోసారి అధికారంలోకి వచ్చి ఎన్డీఏ సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ మేరకు అగ్రికల్చర్, ఉపాధి కల్పన, నూతన ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి, కొత్త సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ నిర్మల ప్రసంగం ఆద్యంతం కొనసాగింది. ఇందులో భాగంగా అన్ని రంగాలు కలిపుకుని రూ.48.21 లక్షల కోట్లను కేటాయించారు. ఈ క్రమంలోనే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో సామాన్యులకు చోటు కల్పించాల్సింది పోయి అదానీ, అంబానీలను అందలం ఎక్కించేలా ప్రయోజనం చేకూర్చారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘కుర్సీ బచావో’ బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి కాంగ్రెస్ మేనిఫెస్టోను, గత బడ్జెట్‌లో ఉన్న అంశాలను కాపీ పేస్ట్ చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు.

Read More..

Union Budget 2024:పేదలకు ఇళ్లు..‘PMAY స్కీమ్’ విస్తరణ

Advertisement

Next Story