- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UNION BUDGET-2024: భారత సంస్కృతి, సభ్యత ఎంతో గొప్పది : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోకెల్లా భారత సంస్కృతి, సభ్యత ఎంతో గొప్పదని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు సందర్భంగా నూతన పార్లమెంట్‌కు వచ్చారు. ఈ మేరకు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్‌లో కొత్త తన తొలి ప్రసంగం ఇదేనని అన్నారు. ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్ తమ లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశం మనదేనని అన్నారు.
రానున్న రోజుల్లో అందరం కలిసికట్టుగా వికసిత్ భారత్ నిర్మిద్దామని పిలుపుచ్చారు. ఇటీవల హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రిడల్లో తొలిసారి వందకు పైగా పతాకాలు సాధించడం సంతోషదాయమని అన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమస్యలపై చర్చించడానికి భారత్ పెద్దన్నగా వ్యవహరించిన జీ20 సమ్మిట్ విజయవంతమైందని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని దేశ వ్యాప్తంగా సంబురంగా చేసుకున్నామని తెలిపారు.
కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయమని అన్నారు. డిజిటల్ రంగంలో గోప్యతను పటిష్టం చేశామని అన్నారు. 500 ఏళ్ల నాటి రామ మందిర కల సాకారమైందని, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మకమని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో సమ్మక్క-సారక్క యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించామని, 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు.భారత్‌లో తొలిసారిగా నమో భారత్ రైలును కూడా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముంబైలో ‘అటల్ సేతు’ నిర్మాణం, దేశంలో 10 లక్షల కి.మీ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.