- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ukraine Attack: రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. 34 డ్రోన్లతో మాస్కోపై దాడి
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా(Russia)పై ఉక్రెయిన్ (Ukraine) విరుచుపడింది. రష్యా రాజధాని మాస్కో(Masco) నగరాన్ని లక్ష్యంగా చేసుకుని 34 డ్రోన్లతో ఆదివారం దాడి చేసింది. ఈ దాడిలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మాస్కో ప్రాంతంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను రష్యా ధ్రువీకరించింది. కీవ్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లను అన్నింటినీ ధ్వంసం చేసినట్టు తెలిపింది. దాడుల నేపథ్యంలో మాస్కోలోని మూడు విమానాశ్రయాల నుంచి పలు విమానాలను దారి మళ్లించారు. కాసేపు విమాన సేవలను సైతం నిలిపివేశారు. డొమోడెడోవో, షెరెమెటీవో, జుకోవ్‌స్కీ విమానాశ్రయాల్లో అంతరాయం ఏర్పడింది. అయితే సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించినట్టు రష్యా ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ తెలిపింది.
పశ్చిమ రష్యాలోని ఇతర ప్రాంతాలపై మరో 36 డ్రోన్లను ధ్వంసం చేశామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా దాడిని తీవ్ర వాద దాడిగా పేర్కొన్న రష్యా అటాక్ చేయడంలో ఉక్రెయిన్ విఫలమైందని పేర్కొంది. రష్యా జనాభాలో ఎక్కువ భాగం మాస్కో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సుమారు 21 మిలియన్ల జనాభాతో, ఇస్తాంబుల్‌తో పాటు ఐరోపాలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలలో మాస్కో ఒకటి. దీంతో జనావాసాలను లక్ష్యంగా చేసుకునే ఉక్రెయిన్ దాడులకు పాల్పడినట్టు సమాచారం. కాగా, 2022 ఫిబ్రవరి 24 నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.