UGC-NET: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. యూజీసీ నెట్ దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్..!

by Maddikunta Saikiran |
UGC-NET: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. యూజీసీ నెట్ దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF), పీహెచ్‌డీ(PHD) ప్రవేశాలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల(Assistant Professors) నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిటీ టెస్ట్(NET) నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను జనవరి 1 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు యూజీసీ(UGC) వెల్లడించింది. మొత్తం 85 సబ్జెక్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టేస్ట్(CBT) విధానంలో ఈ పరీక్షను కండక్ట్(Conduct) చేయనున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 19న ప్రారంభం కాగా.. రేపటితో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in/ ద్వారా రేపటి వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక అప్లై చేసే టైంలో అభ్యర్థులు తమ వివరాలను తప్పుగా నమోదు చేస్తే 12,13వ తేదీల్లో ఎడిట్(Edit)చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా నెట్ పరీక్షకు అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

Next Story

Most Viewed