- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబుడ్స్‌మన్‌లను నియమించని యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన UGC
దిశ, నేషనల్ బ్యూరో: వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి వాటిని పరిష్కరించేందుకు సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని దీనికి అనుగుణంగా అంబుడ్స్‌మన్‌ను నియమించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గతంలో సూచించింది. అయితే తాజాగా జూన్ 1, 2024 నాటికి అంబుడ్స్‌మన్‌ను నియమించని విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. మొత్తం 108 రాష్ట్ర విశ్వవిద్యాలయాలను డిఫాల్ట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చారు. దాదాపు 47 ప్రైవేట్ యూనివర్సిటీలు, రెండు డీమ్డ్ యూనివర్సిటీలు కూడా డిఫాల్ట్ యూనివర్సిటీల జాబితాలో ఉన్నాయి.
అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ విశ్వవిద్యాలయాలు యూజీసీ నిబంధనల ప్రకారం అంబుడ్స్‌మన్‌లను నియమించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అస్సాంలోని అస్సాం రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ కో-ఆపరేటివ్ మేనేజ్‌మెంట్, ఛత్తీస్‌గఢ్‌లోని షహీద్ నందకుమార్ పటేల్ విశ్వవిద్యాలయ, ఉత్తరప్రదేశ్‌లోని మహారాజా సుహెల్ దేవ్ స్టేట్ యూనివర్శిటీ వంటి ఇతర విశ్వవిద్యాలయాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
అంబుడ్స్‌మన్‌ను నియమించిన విశ్వవిద్యాలయాలు పూర్తి వివరాలను అందించడానికి యూజీసీ నాలుగు ఈమెయిల్‌లను షేర్ చేసింది. అవి సెంట్రల్ యూనివర్సిటీ: [email protected], డీమ్డ్ యూనివర్సిటీ: [email protected], రాష్ట్ర విశ్వవిద్యాలయం: [email protected], ప్రైవేట్ విశ్వవిద్యాలయం: [email protected].