- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Udhayanidhi: డీలిమిటేషన్‌కు తమిళనాడు వ్యతిరేకం కాదు.. ఉదయనిధి స్టాలిన్

దిశ, నేషనల్ బ్యూరో: డీలిమిటేషన్ (delimitation) కు తమిళనాడు (Thamilnadu) వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్రంలో సీట్ల సంఖ్యను పెంచడంలో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi stalin) డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా సీట్ల పెంపుదల ఉండేలా చూడాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటరీ సీట్ల పెంపు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండాలని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు సీట్ల పెంచడం, తగ్గించడం డిమాండ్ చేయడం లేదని, వేరే చోట మార్పులు చేస్తే సమానత్వాన్ని మాత్రమే కోరుకుంటుందని నొక్కి చెప్పారు.
ఎటువంటి మార్పులు ఉండబోవని పేర్కొంటూ కేంద్రం ఒక తీర్మానాన్ని ఆమోదించినట్టైతే మాకు ఎటువంటి సమస్యా ఉండబోదని తెలిపారు. కానీ ఇతర రాష్ట్రాలకు సీట్లు పెంచితే, మేము కూడా అదే తరహా అభ్యర్థనే చేస్తామన్నారు. కాగా, జనాభా ఆధారిత డీలిమిటేషన్‌ను ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) నిరంతరం వ్యతిరేకిస్తోంది. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందని వాదిస్తోంది.