సనాతన ధర్మంపై ఉదయనిధి కామెంట్స్.. హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-05 04:11:25.0  )
సనాతన ధర్మంపై ఉదయనిధి కామెంట్స్.. హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తన కూటమి భాగస్వామిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ పేరిట వెనకేసుకురావడం ఏంటని మండి పడ్డారు. సనాతన ధర్మ వినాశనానికి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇస్లాం, క్రిస్టియానిటీ లేదా ఇతర ఏ మతాన్ని అయిన నిర్మూలించాలని ఏవరైనా అంటే ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ పేరిట కాంగ్రెస్ మద్ధతు ఇస్తుందా అని ఫైర్ అయ్యారు. ఇక శనివారం చెన్నైలోని ఓ సమావేశంలో ఉదయనిధి మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా, కరోనా నిర్మూలించినట్లే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.

ఇదే అంశంపై కాంగ్రెస్ లీడర్ కరణ్ సింగ్ సోమవారం మాట్లాడుతూ.. ఉదయనిధి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. సోనియా, గెహ్లట్ ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని రాజ్ నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని రక్షణ శాఖ మంత్రి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed