- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు మరో రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభం
దిశ, వెబ్ డెస్క్ : మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ రైళ్లలో ఒకటి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి నాగర్ కోయిల్ వరకు, మరోటి మధురై నుండి బెంగుళూరు కంటోన్మెంట్ వరకు నడవనున్నాయి. ఆగస్ట్ 31న వీటిని ప్రధాని వర్చువల్ గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా చెన్నై సెంట్రల్ నుండి నాగర్ కోయిల్ మధ్య తిరిగే రైలు ప్రతి బుధవారం మినహా అన్ని రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇది ఉదయం 5 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి బయల్దేరి మధ్యాహ్నం 1.50కి నాగర్ కోయిల్ చేరుకుంటుంది. తిరిగి 2.20కి అక్కడి నుండి బయల్దేరి రాత్రి 11 గంటలకు చెన్నై చేరుకుంటుంది. అలాగే మధురై నుండి బెంగుళూరు మధ్య తిరిగే రైలు ప్రతి మంగళవారం మినహా అన్ని రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. మధురై నుండి 5.15కి బయల్దేరి, మధ్యాహ్నం 1 గంటలకు బెంగుళూరు చేరుకుంటుంది. తిరిగి 1.30కి బెంగుళూరు నుండి బయల్దేరి రాత్రి 9.45కు మధురై చేరుకుంటుంది.