Trending: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం కేసు.. కోర్టులో నిందితుడి సంచలన ఆరోపణలు

by Shiva |   ( Updated:2025-01-20 08:02:56.0  )
Trending: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం కేసు.. కోర్టులో నిందితుడి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్‌ (Junior Doctor)పై కోల్‌కతా (Kolkata)లోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో కీలక నిందితుడు సంజయ్ రాయ్‌ (Sanjay Roy) అని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఈ మేరకు ఇవాళ అతడికి ఉరి శిక్షను ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ధర్మాసనం నిందితుడిని కోర్టుకు ఏమైనా చెప్పుకునేది ఉందా అని ప్రశ్నించగా.. సంజయ్ రాయ్ (Sanjay Roy) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నాడు. తనను కావాలనే కేసులో ఇరికించారని కంటతడి పెట్టాడు. నేరానికి పాల్పడినట్లుగా ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు తీవ్ర ఒత్తిడి చేశారని కామెంట్ చేశాడు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నాడు. బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించాడు. తాను రుద్రాక్ష మాల ధరిస్తానని.. ఒకవేళ తప్పు చేసి ఉంటే తన రుద్రాక్ష పూసలు కూడా తెగిపోయి ఉండాలన్నాడు. తనకు ఉరి శిక్ష కాకుండా.. జైలు శిక్షను విధించాలని ప్రాధేయపడ్డాడు. కాగా, మరికొద్ది క్షణాల్లో సంజయ్ రాయ్‌కి అత్యాచారం సీబీఐ స్పెషల్ కోర్టు కేసులో శిక్షను ఖరారు చేయనుంది.

Next Story