Trending: రోజుకు రూ.5 వేలు ఇస్తేనే కాపురం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు భార్య అల్టిమేటం

by Shiva |   ( Updated:2025-03-20 06:46:37.0  )
Trending: రోజుకు రూ.5 వేలు ఇస్తేనే కాపురం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు భార్య అల్టిమేటం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన ఆలుమగల గొడవలు పంచాయితీలు బజారున పడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట భార్యల వేధింపులు తట్టుకోలేక నిస్సాహా స్థితిలో భర్తలు ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పెళ్లాం పెట్టి మానసిక క్షభను భరించలేక పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుపట్టణంలోని వయ్యాలి కావల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీకాత్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు వారి పరిచయం కాస్త ప్రేమకు దారితీయడంతో 2022 శ్రీకాంత్ ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు.

అయితే, ఇటీవలే వారి కాపురంలో విబేధాలు తలెత్తాయి. సదరు యువతి ఇంట్లోనే ఉంటూ శ్రీకాంత్ కాపురం చేసేందుకు విముఖత చూపుతోంది. రోజుకు రూ.5 వేలు క్యాష్ ఇస్తేనే కాపురం చేస్తానంటూ అల్టిమేటం జారీ చేసింది. అలా ఇవ్వని పక్షంలో రూ.45 లక్షలు భరణం చెల్లించి తన నుంచి విడాకులు తీసుకోవాలని టార్చర్ చేస్తోంది. వర్క్ ఫ్రం హోం చేస్తున్న శ్రీకాంత్‌ను ఆఫీస్‌ జూమ్ మీటింగ్‌కు హాజరయ్యే క్రమంలో అసభ్యకరంగా డ్యాన్స్‌లు చేస్తూ బూతులు తిడుతోందని.. తిరిగి ఏదైనా అంటే చనిపోతానంటూ బెదరింపులకు గురి చేస్తోందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read More..

మేం చెప్పినట్టు చేయకపోతే ఆ ఫోటోలు బయట పెడతాం.. యువతికి బెదిరింపులు..

French woman: మోక్షం పేరుతో కొండపైకి తీసుకుకెళ్లి ఫ్రెంచ్‌ మహిళపై అత్యాచారయత్నం

Next Story

Most Viewed