మరో వివాదంలో పూజా ఖేడ్ కర్.. సర్టిఫికేట్ కోసం ఫేక్ రేషన్ కార్డు

by Shamantha N |
మరో వివాదంలో పూజా ఖేడ్ కర్.. సర్టిఫికేట్ కోసం ఫేక్ రేషన్ కార్డు
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేఢ్ కర్ మరో వివాదంలో చిక్కుకుంది. దివ్యాంగ ధ్రువీకరణ పత్రం పొందడానికి తప్పుడు చిరునామా, నకిలీ రేషన్ కార్డు వాడారని తెలుస్తోంది. పింప్రి చించ్ వాడ్ ప్రాంతాన్ని నివాసంగా పేర్కొంటూ యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్ కి సమర్పించారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. వైసీఎం ఆస్పత్రి నుండి దివ్యాంగ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. ఆమెకు లోకోమోటర్ సమస్య ఉందని అందులో పేర్కొన్నారు. ఆగస్ట్ 24, 2022న జారీ చేయబడిన సర్టిఫికేట్‌లో పూజాకు మోకాలిలో ఏడు శాతం వైకల్యం ఉందని పేర్కొంది.

గత మూడేళ్లుగా పెండింగ్ బకాయిలు

మరోవైపు, పూజ ఖేడ్ కర్ ఇచ్చిన అడ్రెస్ థర్మోవెరిటా ఇంజినీరింగ్ పేరుతో ఉంది. ఆమె వాడే ఆడి కారు కూడా అదే కంపెనీ కింద రిజిస్టర్ అయ్యి ఉంది. గతమూడేళ్లుగా ఆ కంపెనీ పన్ను కట్టలేదని పింప్రీ చించ్ వాడ్ మున్సిపాలిటీ పేర్కొంది. రూ.2.7 లక్షల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఆరోపణలే కాకుండా అధికార దుర్వినియోగం, పోలీసులను బెదిరించడం వంటి ఆరోపణలు పూజాపై వచ్చాయి. 2020 వరకు మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ) డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో పూజ తండ్రి దిలీప్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఏసీపీ అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వానికి పూణే ఏసీబీ అధికారులు నివేదిక అందజేశారు. ఇకపోతే, పూజా ఖేడ్ కర్ శిక్షణ తాత్కాలికంగా నిలిపివేశారు. ఆమెపై తగిన చర్య కోసం ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు పిలిపించారు.

Advertisement

Next Story

Most Viewed