TRAI: ఓటీపీ డెలివరీల్లో ఎలాంటి ఆలస్యం ఉండదు.. ఫేక్ ప్రచారంపై ట్రాయ్ క్లారిటీ..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-01 15:33:57.0  )
TRAI: ఓటీపీ డెలివరీల్లో ఎలాంటి ఆలస్యం ఉండదు.. ఫేక్ ప్రచారంపై ట్రాయ్ క్లారిటీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్పామ్ కాల్స్, మెసేజ్(Spam calls, Messages)లను అరికట్టడానికి టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ఇటీవలే కొత్త రూల్స్(New Rules)ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రిజిస్టర్ చేయని టెలీమార్కెటింగ్, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి వచ్చే బల్క్ SMS లు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు టెలికాం సంస్థలకు ట్రాయ్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. మోసపూరిత సందేశాలు, ఓటీపీ(Messages, OTP)లను బ్లాక్ చేయాలనే లక్ష్యంతో ట్రేస్ బిలిటీ(Traceability) నిబంధనను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం డిసెంబర్ 1 నుంచి వచ్చిన ప్రతి మెసేజ్ తాలూకా మూలాల్ని టెలికాం కంపెనీలు గుర్తించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే నెట్ బ్యాంకింగ్(Net banking), ఈ -కామర్స్(E-Commerce), ఆధార్(Aadhar) ఓటీపీ మెసేజ్ లు డిసెంబర్ 1 నుంచి ఆలస్యం కానున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ట్రాయ్ ఖండించింది. మెసేజ్ ల డెలివరీలో ఎలాంటి జాప్యం ఉండబోదని, ఓటీపీలు ఎప్పటిలాగే సత్వరమే అందుతాయని తెలిపింది. ఫేక్ కాల్స్(Fake Calls), ఫ్రాడ్ మెసేజ్(Fraud Messages)లను అరికట్టేందుకు ట్రేస్ బిలిటీ వ్యవస్థను తీసుకొచ్చామని, దీని ప్రభావం ఓటీపీ డెలివరీలపై ఉండబోదని సృష్టం చేసింది. ఆలస్యం అవుతాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వెల్లడించింది. ఈ మేరకు ట్రాయ్ ఎక్స్(X)లో పోస్ట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed