అసోంలో తీవ్ర విషాదం..వరదల ప్రభావంతో 30 మందికి పైగా మృతి

by vinod kumar |
అసోంలో తీవ్ర విషాదం..వరదల ప్రభావంతో 30 మందికి పైగా మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో తీవ్ర విషాదం చోటు చేసుకుకుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో 30 మందికి పైగా మరణించినట్టు అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. తాజాగా కరీంగంజ్ జిల్లాలోని బదర్‌పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించినట్టు పేర్కొంది. మొత్తంగా15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమైనట్టు వెల్లడించింది. కరీంగంజ్ అత్యంత ప్రభావితమైన జిల్లాగా నిలిచింది. ఈ ప్రాంతంలో 1,52,133 మంది వరదనీటిలో చిక్కుకున్నారు.

అలాగే 1,378.64 హెక్టార్ల పంట విస్తీర్ణం ధ్వంసం కాగా.. 54,877 జంతువులు ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం 24 రెవెన్యూ సర్కిళ్లలో 470 గ్రామాలు నీట మునిగాయి. 43 సహాయ శిబిరాల్లో 5,114 మంది ఆశ్రయం పొందుతున్నారు. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. రోడ్లు, వంతెనలతో సహా మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. కంపూర్ వద్ద కోపిలి నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed