ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

by Mahesh Kanagandla |
ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో ఆరు అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 13వ తేదీన ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేయడానికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఆరు స్థానాల్లోని ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవడంతో శాసన సభ్యత్వానికి రాజీనామాలు చేశారు. ఫలితంగా ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఆరు స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు టీఎంసీ గెలుచుకోగా.. ఒకటి బీజేపీ గెలుచుకుంది.

కూచ్ బెహార్ జిల్లాలోని సీతై నుంచి సంగీతా రాయ్‌ను, మదారిహత్ నుంచి జై ప్రకాశ్ తొప్పో్, నైహాతి నుంచి సనత్ దేయ్, హరోవా నుంచి షేక్ రబియుల్ ఇస్లాం, తల్దంగ్రా నుంచి ఫల్గుణి సింఘబాబు, మేదినీపూర్ నుంచి సుజోయ్ హజ్రాలను బరిలోకి దింపుతున్నట్టు టీఎంసీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

Next Story

Most Viewed