- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Thripura: త్రిపురలో వరదల బీభత్సం..12 మంది మృతి

దిశ, నేషనల్ బ్యూరో: త్రిపురలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఆయా ఘటనల్లో 12 మంది మృతి చెందినట్టు అధికారులు గురువారం తెలిపారు. వరదల వల్ల17 లక్షల మంది ప్రభావితం కాగా..వారిలో 65,000 మందికి పైగా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్టు వెల్లడించారు. వరదల ప్రభావం తగ్గక పోవడంతో ఎనిమిది జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్టు సీఎం సాహా ప్రకటించారు. నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు చెప్పారు. వరదల కారణంగా 1,055 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైల్వే ట్రాక్‌లు సైతం ధ్వంసమయ్యామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్రిపుర సీఎంతో మాట్లాడి రాష్ట్రంలో వరద పరిస్థితిపై సమీక్షించారు. కేంద్రం తరఫున అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.