'Google' టాప్ 5లో ముగ్గురు ఇండియన్స్

by Nagaya |   ( Updated:2022-12-16 06:28:50.0  )
Google టాప్ 5లో ముగ్గురు ఇండియన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : గూగుల్‌'మోస్ట్ సెర్చ్‌డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా ఇండియన్స్ రికార్డు సృష్టించారు. గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన ఏషియన్ వ్యక్తుల్లో టాప్5లో మన భారతీయులే ముగ్గురు ఉండడం విశేషం. ఈ ఏడాది గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఏషియన్‌ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాప్-5లో ముగ్గురు ఇండియన్స్ చోటు సంపాదించుకున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాప్-3లో ఉన్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్‌లు కత్రినా కైఫ్ నాలుగో స్థానంలో, ఆలియా భట్ ఐదో స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో తిరుగులేని విజేతలుగా సౌత్ కొరియా బ్యాండ్ బీటీఎస్ సభ్యులు తేయుంగ్, జంగ్ కుక్ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఇక, అన్ని రంగాల నుంచి గూగుల్ మోస్ట్ సెర్చ్ డ్ లిస్ట్ తీస్తే.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం కత్రినాకైఫ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆలియా భట్, దీపికా పదుకొనేలను వెనక్కినెట్టి కత్రినా నాలుగో స్థానానికి దూసుకుపోయింది.

ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా వెతికిన సినిమా జాబితాలో టాప్ 3లో 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్','సూర్యవంశీ','83'మూవీలు ఉన్నాయి. ఇందులో కైఫ్ ప్రముఖ పాత్రలు పోషించినట్లు నివేదిక వెల్లడించింది. దీంతో, కత్రినా 'ఇయర్ ఇన్ సెర్చ్'గా నివేదికలో నిలిచినట్లు గూగుల్ వెల్లడించింది. మరోవైపు సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్లు ఉన్నా ఒకరికి కూడా టాప్ 5లో చోటు దక్కకపోవడం గమనార్హం. పాన్ ఇండియా లెవల్‌లో బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇంత మంది ఉన్నా టాప్-5లో కత్రినా స్థానం దక్కించుకోవడం విశేషం.

Also Read....

పంట నష్ట పరిహారం కోసం రైతుల వినూత్న నిరసన

Advertisement

Next Story

Most Viewed