సల్మాన్ ను బెదిరించి తప్పుచేశా : పోలీసులకు మెసేజ్

by Y. Venkata Narasimha Reddy |
సల్మాన్ ను బెదిరించి తప్పుచేశా : పోలీసులకు మెసేజ్
X

దిశ, వెబ్ డెస్క్ : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ ను బెదిరిస్తూ ఇటీవల పోలీసులకు మెసేజ్ పంపిన నంబర్ నుంచే అందుకు విరుద్దమైన మరో మెసేజ్ రావడం చర్చనీయాంశమైంది. సల్మాన్ ను బెదిరించి తప్పుచేశానని.. తనను క్షమించమని ఆ మెసేజ్ లో నిందితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో మెసేజ్ పెట్టాడు. సల్మాన్ కు బెదిరింపు మెసేజ్ పంపించి చాలా తప్పుచేశానని.. తనను క్షమించాలని ఆ మెసేజ్ లో పేర్కొన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ మెసేజ్ లు జార్ఖండ్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బిష్ణోయ్ సామాజిక వర్గం ఎంతగానో ఆరాధించే రెండు కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడి చంపినప్పటి నుంచి అతడిని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌ చేసుకుంది. ఇందులో భాగంగా సల్మాన్ తో సన్నిహితంగా ఉన్న ప్రతీ ఒక్కరినీ చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని తామే హతమార్చామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదే క్రమంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు చంపేస్తాం అంటూ మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది. బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న ఈ గొడవకి ఒక ముగింపు పలకాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల ముంబయి ట్రాఫిక్‌ పోలీసుల వాట్సప్‌ నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే. అడిగిన మొత్తాన్ని చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదే నంబర్ నుంచి సల్మాన్ ను బెదిరించి తప్పుచేశానంటూ ఆ నిందితుడు మెసేజ్ పెట్టడంతో ఆ మెసేజ్ వ్యవహారాన్ని తేల్చే పనిలో ముంబై పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌ సబర్మతి జైలులో ఉన్నాడు. ఈ ఏడాది బాలీవుడ్ సూపర్ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులోనూ లారెన్స్‌ బిష్ణోయ్ పేరు వినబడింది. బిష్ణోయ్ జైలులో ఉండటంతో ఆ గ్యాంగ్ లోని బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, గోల్డిబ్రార్‌, రోహిత్ గోదర్ లు విదేశాల్లో ఉంటూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed