Nayanthara: మరచిపోలేని అనుభూతులను ఇచ్చినందుకు థాంక్స్.. నయనతార ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
Nayanthara: మరచిపోలేని అనుభూతులను ఇచ్చినందుకు థాంక్స్.. నయనతార ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) నటించిన ‘నేను రౌడీనే’(Nenu Rowdy Ne) సినిమా విడుదలై 9 ఏళ్లు పూర్తి కావడంతో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన సినిమా. నా కెరీర్‌ను గొప్పగా మలచిన నేను రౌడినే 9 ఏళ్ల క్రితం విడుదలై హిట్ అయి మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌(Vignesh)కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. అంతేకాకుండా ఈ సినిమా నాకు విఘ్నేశ్‌(Vignesh)ను భర్తగా ఇచ్చింది’’ అని రాసుకొచ్చింది.

ప్రజెంట్ నయన్(Nayanthara) పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ‘నేను రౌడీనే’ (Nenu Rowdy Ne)సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి(Vijay Sethupathi) జంటగా నటించగా.. విఘ్నేశ్(Vignesh) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 2015లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా ప్రేక్షకాదరణను పొంది వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందనడంలో అతిశయోక్తి లేదు. కాగా, నయన్, విఘ్నేశ్ శివన్‌(Vignesh)లు ‘నేను రౌడీనే’(Nenu Rowdy Ne) సినిమాతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఉయిర్, ఉలగమ్ అను ట్విన్స్ కుమారులు కూడా ఉన్నారు. ప్రజెంట్ నయనతార బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

Advertisement

Next Story