- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్ ప్రసంగంలో Nirmala Sitharaman వాడే పదాలు ఇవే!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని గంటల్లో బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆమె బడ్జెట్ ప్రసంగంలో వాడే పదాలు, వాటి అర్ధాలు తెలుసుకుందామా..!
బడ్జెట్..
ఈ పదం 'బోగెట్టీ' అనే ఫ్రెంచ్ పదం నుంచి పుట్టింది. బోగెట్టీ అంటే చిన్న తోలు సంచి అని అర్ధం. బడ్జెట్ లో రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అని రెండు రకాలు.
రెవెన్యూ బడ్జెట్.. రెవెన్యూ లోటు..
రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం, చేసే ఖర్చులనే రెవెన్యూ బడ్జెట్ అంటారు. పన్నులు, పన్నేతరం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే రెవెన్యూ ఆదాయం. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం, ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడం, ప్రజలకు సబ్సిడీలు అందిండం వంటివి రెవెన్యూ వ్యయం పరిధిలోకి వస్తాయి. రెవెన్యూ ఆదాయానికి, వ్యయానికి మధ్య గల తేడాను రెవెన్యూ లోటు అని పిలుస్తాం.
క్యాపిటల్ బడ్జెట్..
పెట్టుబడి ఆదాయం, వ్యయాల సమాహారమే క్యాపిటల్ బడ్జెట్. ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వాలకు, రిజర్వు బ్యాంకుకు ప్రభుత్వం ఇచ్చే రుణాల ద్వారా వచ్చే ఆదాయమే పెట్టుబడి ఆదాయం. విద్య, వైద్యం, నిర్మాణం, ఇతర రంగాల్లో ప్రభుత్వం పెట్టే ఖర్చును పెట్టుబడి వ్యయంగా పరిగణిస్తారు. పెట్టుబడి ఆదాయం కంటే వ్యయం ఎక్కువైతే ద్రవ్యలోటుగా పిలుస్తారు.
జీడీపీ..
ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తు, సేవల పూర్తి విలువను స్థూల జాతీయోత్పత్తి అని పిలుస్తారు. జీడీపీ ఆధారంగానే దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా ఉంచేందుకు ప్రభుత్వం పన్నులు, ఇతర ఖర్చులను నియంత్రణలో ఉంచేందుకు చేసే ప్రయత్నాన్నే ద్రవ్య విధానం (ఫిస్కల్ పాలసీ) అంటారు.
డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ ట్యాక్స్..
ప్రజలపై, వ్యాపారాలపై ప్రభుత్వం నేరుగా వేసే పన్నును డైరెక్ట్ ట్యాక్స్ (ప్రత్యక్ష పన్ను) అంటారు. కంపెనీల లాభాలపై వేసే పన్నులను కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. వస్తువులు, సేవలపై విధించే కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ ట్యాక్స్, జీఎస్టీ వంటి పన్నులను ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఈ ట్యాక్స్ ను ప్రజలపై నేరుగా విధించరు. పన్నులు, ఇతర ఖర్చులను నియంత్రణలో ఉంచుతూ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా ఉంచేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనే ద్రవ్య విధానం (ఫిస్కల్ పాలసీ) అంటారు.
Also Read...