- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీఎస్టీ డబ్బంతా ధనవంతుల చేతుల్లోకి వెళ్తోంది: రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు దగ్గపడుతున్న వేళ కీలక నేతల మధ్య విమర్శలు మరింత పదునెక్కుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపణలతో ఎన్నికల ప్రచారానికి హీట్ పెంచారు. తాజాగా కేరళలో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రస్తుతం రెండు ఇండియాలు ఉన్నాయని, ఒకటి బిలీయనీర్లకు చెందినది, రెండోది పెద్ద సంఖ్యలో దేశంలో నివశిస్తున్న ప్రజలదని అన్నారు. దేశంలో 70 కోట్ల మంది వద్ద ఉన్నదానికంటే ఎక్కువ సంపద ఉన్నవారు 22 మంది మాత్రమే ఉన్నారు. అలాగే, రోజుకు రూ. 100 కంటే తక్కువ సంపాదించే వారు 70 కోట్ల మంది జనాభా ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ముఖ్యంగా తన ప్రసంగంలో పేద, మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్నుల గురించి మాట్లాడిన ఆయన, భారత్‌లో అత్యంత పేద వ్యక్తి గౌతమ్ అదానీ అని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న మిగిలిన ప్రజల మాదిరిగానే పేద వ్యక్తి అయిన అదానీ కూడా ఒకే రకమైన జీఎస్టీ చెల్లిస్తారు. మొత్తం జీఎస్టీ డబ్బంతా ధనవంతుల జేబుల్లోకి వళ్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని మోడీ 25 మంది భారతీయులకు చెందిన రూ. 16 లక్షల కోట్ల విలువ బ్యాంకు రుణాలను మాఫీ చేశారని ఆరోపణలు చేశారు. దేశంలో అస్థిరతను సృష్టించడం, దేశంలోని ప్రజలు ఒకరినొకరు పోట్లాడటమే బీజేపీ అలోచన అని తీవ్రంగా మండిపడ్డారు. చివరికి ప్రధానికి సన్నిహితంగా ఉన్న కొందరికి మాత్రమే దేశ సంపదను ఇవ్వడమని పేర్కొన్నారు.