ఛీ..చీ.. స్కూల్లోనే ఆపని చేసిన మహిళ ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఆమెపై దారుణంగా దాడి (వీడియో)

by Disha Web Desk 7 |
ఛీ..చీ.. స్కూల్లోనే ఆపని చేసిన మహిళ ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఆమెపై దారుణంగా దాడి (వీడియో)
X

దిశ, ఫీచర్స్: ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఆనందాన్ని కలగిస్తుంటే మరికొన్ని మాత్రం చిరాకు తెప్పిస్తుంటాయి. తాజాగా అదే కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ స్కూల్లో మహిళ ప్రిన్సిపల్ చేసిన పనికి ఎవరైన ఛీ అనాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా దండమౌలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్రామానికి చెందిన ఓ ప్రాథమిక పాఠశాలలో ఓ మహిళ ప్రిన్సపల్‌గా విధులు నిర్వహిస్తుంది. స్కూల్లో పిల్లకు పాఠాలు ఎలా చెప్తున్నారు, వాళ్లకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన భాద్యత ఆమెపై ఉంది. కానీ అవన్ని పక్కన పెట్టి.. ఓవైపు స్కూలులో క్లాసులు జరుగుతుండగానే అందం మీద ఫోకస్ పెట్టింది ఈ మహిళ ప్రిన్సిపల్. ఏకంగా స్కూల్ వంటగదిలోనే ఫేషియల్ చేయించుకుంది. ఈ తతంగాన్ని ఓ మహిళ వీడియో తీయడంతో.. కోపంతో ఊగిపోయిన మహిళ ప్రిన్సిపల్ వీడియో తీసిన ఆమెపై దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా, టీచర్ల గురించి పట్టించుకోకుండా స్కూలులోనే ఫేషియల్ చేయించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అంతేకాకుండా ఈ నిర్వాకాన్ని వీడియో తీసినందుకు ఆ మహిళలపై దాడి చేసిన తీరుపై మండిపడుతున్నారు నెటిజన్లు.



Next Story