‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం.. రెండు రాష్ట్రాల్లో హైటెన్షన్

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-05 09:22:41.0  )
‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం.. రెండు రాష్ట్రాల్లో హైటెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు కాంగ్రెస్, వామపక్షపార్టీలు, ముస్లిం సంఘాలు ఫైర్ అవుతున్నాయి. సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ, తమిళనాడులో సినిమా విడుదల నేపథ్యంలో ఆందోళనలు చేపడుతున్నారు. కొచ్చిలోని థియేటర్ల దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సినిమా విడుదలను ఆపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆందోళన నేపథ్యంలో తమిళనాడులోని థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

థియేటర్లకు పూర్తి భద్రత కల్పించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కేరళలో మతమార్పిడిలు, రాడికలైజేషన్, టెర్రరిజం కాన్సెప్ట్ చేసుకుని ఈ సినిమాను సుదీప్తో సేన్ తీశారు. కేరళలో 32,000 మంది హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన మహిళలను ఇస్లాంలోకి మార్చారని. వారిలో కొంత మంది ఐసీస్‌లో చేరడానికి సిరియాకు వెళ్లినట్లు సినిమా ట్రైలర్‌లో చూయించారు. దీంతో వివాదం రాజుకుంది.

Also Read...

‘ది కేరళ స్టోరీ’ ఎందుకింత హాట్ టాపిక్ అయింది? అసలు ఈ మూవీలో ఏముంది?

Advertisement

Next Story