- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ది కాశ్మీర్ ఫైల్స్' ఎఫెక్ట్: కాశ్మీర్ ముస్లీమ్‌లకు ఢిల్లీ హోటళ్లు షాక్!
దిశ, వెబ్‌డెస్క్ః భారతదేశంలో ప్రజల నుండి సినిమాని విడిదీసి చూడలేము. వాళ్లు వ్యాపారం చేసుకుంటున్నారని తెలిసినా ప్రేక్షకులు మాత్రం సినిమావాళ్లను దేవుళ్లుగా భావిస్తారు. వాళ్లు చెప్పిందే అఖండ సత్యమన్నట్లు పాటిస్తారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన వివాదస్పద సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్' ఇండియాలో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన హిందువులు కొందరు థియేటర్లలోనే 'ధర్మసంస్థాపన' ప్రసంగాలు చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా భారత రాజధాని ఢిల్లీ మహానగరంలో కాశ్మీర్ ముస్లింలపై మరింత వివక్ష పెరిగింది. హోటల్ అగ్రిగేషన్ సంస్థ ఓయో రూమ్స్ క్రింద ఉన్న ఓ ఢిల్లీ హోటల్, ఒక కాశ్మీరీ వ్యక్తి బుక్ చేసుకున్న రూమ్‌ని ఇవ్వమంటూ మొఖం మీద చెప్పేసింది.
ఆధార్ కార్డ్‌తో సహా, గుర్తింపు ఐడీ ప్రూఫ్‌లను చూపించిన తర్వాత కూడా కాశ్మీరీ గుర్తింపు ఉందని చెప్పి ముందే బుక్ చేసుకున్న గదికి చెక్-ఇన్ చేయనివ్వలేదు. ఎందుకుని అడిగితే.. హోటల్ రిసెప్షన్‌లో ఉన్న మహిళ తన యజమానికి ఫోన్ చేసి, ఆ తర్వాత ఢిల్లీ పోలీసులే కాశ్మీరీలకు రూమ్ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారంటూ అబద్దం చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జమ్మూకశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధికార ప్రతినిధి నాసిర్ ఖుహమీ ఈ కేసును తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
Impact of #KashmirFiles on ground.
— Nasir Khuehami (ناصر کہویہامی) (@NasirKhuehami) March 23, 2022
Delhi Hotel denies accommodation to kashmiri man, despite provided id and other documents. Is being a kashmiri a Crime. @Nidhi @ndtv @TimesNow @vijaita @zoo_bear @kaushikrj6 @_sayema @alishan_jafri @_sayema @manojkjhadu @MahuaMoitra pic.twitter.com/x2q8A5fXpo
కాగా, ఈ ఘటనపై నిన్న రాత్రి ఢిల్లీ పోలీసులు వరుస ట్వీట్లతో వివరణ ఇచ్చారు. ఢిల్లీలోని హోటళ్లకు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పిదాలు చేస్తే, జరిమానా విధిస్తామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.
A purported video is viral on social media wherein a person is being denied hotel reservation due to his J&K ID. The reason for cancellation is being given as direction from police.
— Delhi Police (@DelhiPolice) March 23, 2022
It is clarified that no such direction has been given by Delhi Police.(1/3)@ANI @PTI_News
ఇక ఈ వీడియో వైరల్ అయిన వెంటనే ఓయో రూమ్స్ యాజమాన్యం సదరు ఢిల్లీ హోటల్‌ను తమ ప్లాట్‌ఫారమ్‌పై నుండి తొలగించింది. మా గదులు, మా హృదయాలు ఎల్లప్పుడూ అందరికీ తెరిచి ఉంటాయంటా వివరణ ఇచ్చింది.
— OYO4U (@OYO4U) March 23, 2022