బంపర్ ఆఫర్ 42 ఎకరాల అదిరిపోయే విల్లా.. ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం

by Disha Web Desk 7 |
బంపర్ ఆఫర్ 42 ఎకరాల అదిరిపోయే విల్లా.. ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో అద్దెకు ఇళ్లు దొరకాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి. ఒకవేళ దొరికిందంటే.. రెంట్లు భారీగా వసూళ్లు చేస్తున్నారు. అది కూడా ఒకటి, రెండు గదులు ఉన్న ఇళ్లకే వేలల్లో అద్దెలు వసూళ్లు చేస్తుంటారు. అదే విల్లాలు గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. అవి షూటింగ్స్‌కు, పెద్ద పెద్ద వాళ్లు నివసించడానికి తప్ప సామాన్యులు దానిని నేరుగా చూసింది కూడా లేదు. అలాంటిది ఏకంగా 42 ఎకరాల్లో ఉన్న అదిరిపోయే విల్లాను ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. అసలు విషయంలోకి వెళితే..

జర్మనీ రాజధాని బెర్లిన్‌కు 25 మైళ్ల దూరంలో ఆ విల్లా ఉంది. దానిని 1936లో నిర్మించారు. గోబెల్స్ అనే వ్యక్తి ఈ విల్లాను ఉపయోగించే వారని తెలుస్తుంది. అయితే.. రెండో ప్రపంచయుద్ధం చివరి దశలో గోబెల్స్ తన భార్య, ఆరుగురు పిల్లలతో కలసి అందులో ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ మీడియాలో ప్రచారం జరిగింది. 2వేల సంవత్సరం నుంచి ఈ విల్లాలో ఎవరూ నివసించడం లేదట. ప్రస్తుతం ఆ విల్లా రోజురోజుకూ దెబ్బతింటుంది.

ప్రజెంట్ ఈ విల్లా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. దాని మెయింటెనెన్స్ ఎక్కవగా ఉండటంతో ప్రభుత్వం దానిని వదిలించుకోవాలని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి స్టెఫాన్ ఎవర్స్ మాట్లాడుతూ.. ‘ఈ విల్లాను సొంతం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే ప్రభుత్వం దీనిని గిఫ్ట్‌గా ఇస్తుంది’ అంటూ తెలిపారు. ఈ క్రమంలోనే.. దీనిని సొంతం చేసుకునేందుకు కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వారి నుంచి తగిన ప్రతిపాదన లేనట్లయితే.. ఈ విల్లాను ప్రభుత్వం కూల్చివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed