Breaking News : పోలీసుల ముందే కన్న కూతురును కడ తేర్చిన తండ్రి

by M.Rajitha |   ( Updated:2025-01-15 12:03:19.0  )
Breaking News : పోలీసుల ముందే కన్న కూతురును కడ తేర్చిన తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్ : పోలీసుల ముందే కన్న కూతురును ఓ తండ్రి కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్(MadhyaPradesh) లో చోటు చేసుకుంది. గ్వాలియర్(Gwaliyar) కు చెందిన తనూ గుజ్జర్ కు ఈనెల 18 వివాహం కుదిరింది. అయితే తనకి ఈ వివాహం ఇష్టం లేదని, తను వేరే అబ్బాయిని ప్రేమిస్తునాన్నని, అతడిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ విషయం పోలీసులకు, గ్రామస్తులకు తెలియడంతో మంగళవారం ఆ యువతి తండ్రి మహేష్ గుజ్జర్ ను పిలిచి స్థానిక దేవాలయంలో పంచాయితీ నిర్వహించారు. అయితే తాను ఈ వివాహం చేసుకోనని ఆ యువతి తెగేసి చెప్పడంతో ఆగ్రహించిన తండ్రి.. వెంటతెచ్చుకున్న తుపాకీతో అందరూ చూస్తుండగానే ఆమెను కాల్చిచంపాడు. పోలీసులు మహేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఈ వార్త దుమారం రేపుతోంది .

Next Story

Most Viewed