కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణకు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ

by Disha Web Desk 17 |
కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణకు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టయిన హెచ్‌డీ రేవణ్ణకు బుధవారం కోర్టు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయన అప్పీల్ చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను గురువారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా హెచ్‌డీ రేవణ్ణ పోలీసు కస్టడీ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానంగా, కడుపునొప్పితో మూడు రోజులుగా నిద్రపట్టడం లేదు, ఎక్కడికీ వెళ్లడం లేదు, ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని నిన్ననే చెప్పారు, తప్పు చేస్తే ఒప్పుకుంటా.. కానీ నేను చేయలేదు, చాతీ నొప్పి, గుండెల్లో మంటగా ఉంది, వారెంట్ లేకుండానే నన్ను అరెస్టు చేశారని, 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో తనపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన అన్నారు.

విచారణ సందర్భంగా రేవణ్ణ తనను తప్పుగా ఇరికించేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు, హెచ్‌డీ రేవణ్ణ కూడా మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక మహిళను కిడ్నాప్ చేశారనే కారణంతో హెచ్‌డీ రేవణ్ణను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు, అది ముగియడంతో తాజాగా కోర్టు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

Next Story