- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ranya Rao : రన్యా రావుకు భారీ షాకిచ్చిన కోర్ట్

దిశ, వెబ్ డెస్క్ : ఆక్రమబంగారం కేసు(Gold Smuggling Case)లో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు(Ranya Rao)కు కోర్టు భారీ షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇదే కేసులో అరెస్టయిన మరో నిందితుడు తరుణ్ బెయిల్ పిటిషన్ పై శనివారం కోర్టులో విచారణ జరగనుంది. అయితే కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పలు కీలక విషయాలు బయటకి వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె డీఆర్ఐ అధికారులకు తెలియజేశారు. యూట్యూబ్ లో వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఆమె పినతండ్రి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కే. రామచంద్రరావు పేరు బయటికి రాగా, మరికొంతమంది రాజకీయ నాయకుల పేర్లు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సూత్రధారులు ఎవరనే విషయంపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. దీంతో ఈ కేసులో అనుమానితులుగా భావించిన ఎవరికైనా సీబీఐ ఇవ్వొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Ranya Rao: యూట్యూబ్‌లో చూసి బంగారం స్మగ్లింగ్ నేర్చుకున్నాను.. అధికారులతో రన్యారావు