బాలికను బెదిరించి.. పలు దఫాలుగా ఆ పని చేసిన దుండగులు.. అసలేమైందంటే?

by Jakkula Mamatha |
బాలికను బెదిరించి.. పలు దఫాలుగా ఆ పని చేసిన దుండగులు.. అసలేమైందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ(Technology) ఎంతగా అభివృద్ది చెందిందో చూస్తునే ఉన్నాం. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు సైబర్ నేరాల బారిన పడి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా వార్తల్లో నిలిచాయి. ఈ తరుణంలో పోలీసులు సైబర్ దాడుల(Cyber ​​attacks) నుంచి రక్షణ పొందెందుకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయిన ఈ మోసాలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.

ఓ బాలిక తెలియక చేసిన పనికి అమ్మమ్మ ఖాతాలోని రూ.80 లక్షలు ఖాళీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని తన స్నేహితురాలితో మాట్లాడుతున్న క్రమంలో ఓ విషయం చెప్పింది. ‘తాము భూమిని అమ్మి వేయగా రూ.80 లక్షలు వచ్చాయని.. అవి తన అమ్మమ్మ ఖాతాలో ఉన్నాయి’ అని ఆ బాలిక తన స్నేహితురాలికి చెప్పింది. ఆ విషయాన్ని విన్న పదో తరగతి విద్యార్థి ఆ డబ్బులను ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆ విషయం తన సోదరుడితో చర్చించాడు. దీంతో వారిద్దరూ మరికొందరితో కలిసి వృద్ధురాలి అకౌంట్ లో ఉన్న డబ్బులు దోచేయాలని ప్రణాళిక వేశారు.

ఈ క్రమంలో ఆ యువకుడు ఆన్‌లైన్‌(Online)లో బాలికతో పరిచయం పెంచుకొని ఆమె ఫొటోలు సేకరించాడు. ఈ నేపథ్యంలో మార్ఫింగ్ ఫొటో(Morphing Photos)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని పదిహేను ఏళ్ల బాలికను బెదిరించి.. రూ.80 లక్షలు కాజేశారు. దీంతో అతడు మరో ఇద్దరితో కలిసి మార్ఫింగ్ ఫొటోలతో బాలికను బెదిరించి.. పలు దఫాలుగా డబ్బులు మొత్తం బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత కూడా వేధింపులు కొనసాగుతుండటంతో బాధితురాలు తన టీచర్(Teacher) సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు(Police) ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో నిందితుల నుంచి రూ.36 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed