అందుకే ఆర్టికల్ 370 రద్దు చేశాం: కశ్మీర్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by samatah |
అందుకే ఆర్టికల్ 370 రద్దు చేశాం: కశ్మీర్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధాన అడ్డంకిగా మారిందని అందుకే దానిని రద్దు చేశామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ‘గతంలో కశ్మీర్ ఎల్లప్పుడూ ఉద్రిక్తంగా ఉండేది. బాంబుల మోతతో దద్దరిల్లేది. కానీ ప్రస్తుతం కశ్మీర్ అభివృద్ధిలో దూసుకు పోతుంది’ అని చెప్పారు. మంగళవారం ఆయన కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 32,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. కశ్మీర్ ప్రజల 70ఏళ్ల కళలను రాబోయే రోజుల్లో మోడీ నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు కారణంగా ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు, ఎన్డీయే కూటమి 400 సీట్లలో గెలిపించాలని కోరారు. అన్ని రంగాల్లో కశ్మీర్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా యువత గళం విప్పాలని సూచించారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని మోడీ తొలి ఎలక్ట్రిక్ రైలును ప్రారంభించారు. అలాగే సంగల్దాన్- బారాముల్లా మధ్య రైలు సర్వీసుకు శంకుస్థాపన చేశారు.

Advertisement

Next Story