- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీరియల్ కిల్లర్ స్టోరీని తలపిస్తున్న ఘటన.. 12 మంది స్నేహితులను చంపిన మహిళ
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌కు చెందిన గర్భిణి స్త్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైనైడ్ ఇచ్చి 12 మంది స్నేహితులను చంపిందని ఈమెపై ఆరోపణలు ఉన్నాయి. స్నేహితురాలి మరణంపై దర్యాప్తు ప్రారంభించిన తర్వాత సరరత్ రంగ్సివుతాపోర్న్ అనే 32 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఆరంభంలో ఆమె స్నేహితురాలు సిరిపోర్న్ ఖాన్‌వాంగ్ మృతి చెందడంతో అనుమానం వచ్చింది.
ఏప్రిల్ 14న రింగ్సివుతాపోర్న్, సిరిపోర్న్ ఖాన్‌వాంగ్ కలిసి రచ్చబురి ప్రావిన్స్‌కు విహారయాత్రకని వెళ్లారు. అక్కడ వారు బౌద్ధ సంప్రదాయ ఆచారాల్లో పాల్గొన్నారు. కానీ ఆమె స్నేహితురాలు నడి ఒడ్డున చనిపోయివుంది. శవ పరీక్ష చేయగా.. ఆమె శరీరంలో సైనైడ్ ఉందని.. అందుకే గుండె ఆగి చనిపోయిందని తేలింది. ఆమె ఫోన్, డబ్బులు, బ్యాగు కూడా ఎవరో దొంగిలించారు.
రంగ్సివుతాపోర్న్ తన మాజీ ప్రియుడితో సహా మరో 11 మందిని హత్య చేసినట్టు తాజా మరణం విచారణ సందర్భంగా పోలీసులు కనుగొన్నారు. 2020 డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్ మధ్య కాలంలో 33 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులు మరణించారని.. బాధితుల మరణం ఒకే తరహాలో జరిగిందని పోలీసులు చెప్పారు. నగలు, నగదు మాయమైనట్లు బాధితుల బంధువులు ఫిర్యాదు చేశారని తెలిపారు. సైనైడ్ అనేది మనిషి చనిపోయిన కొన్ని నెలల తర్వాత బయటపడుతుంది. ఇది గుండెపోటుకు కారణమవుతుంది.