- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాది అరెస్ట్..భారీగా ఆయుధాలు స్వాధీనం
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ, కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఉత్తర కశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని ఇంటలిజెన్స్ సమాచారం మేరకు బందిపోరా జిల్లాలోని పెత్‌కూట్ అడవిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు పిస్టల్స్, ఒక హ్యాండ్ గ్రెనేడ్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
నిందితుడు నిషేధిత ఉగ్రవాద సంస్థ సంబంధం కలిగి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఉత్తర కశ్మీర్‌లో ఉగ్ర సంస్థ నిర్వహించే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్టు భావిస్తున్నారు. కాగా, కశ్మీర్‌లోని కుల్గాంలో టీవల జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే భారత వైమాణిక దళం కాన్వాయ్ పై కూడా ఉగ్రదాడి చేయగా ఓ జవాన్ మరణించగా..నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే మరో ఉగ్రవాది పట్టుబడటం కలకలం రేపుతోంది.