Cow Dung: జల్లికట్టు, సదర్ సమ్మేళనం చూశాం.. పండక్కి ఈ పేడతో కొట్టుకోవడం ఏందయ్యా..

by Rani Yarlagadda |
Cow Dung: జల్లికట్టు, సదర్ సమ్మేళనం చూశాం.. పండక్కి ఈ పేడతో కొట్టుకోవడం ఏందయ్యా..
X

దిశ, వెబ్ డెస్క్: జల్లికట్టు (Jallikattu) చూశాం.. సదర్ (Sadar) సమ్మేళనం చూశాం.. కానీ పండక్కి ఆవుపేడతో ఒకరినొకరు కొట్టుకోవడం ఎక్కడైనా చూశారా? ఆవుపేడ (Cow Dung) ఎంత పవిత్రమైనదైనా.. ఆ వాసన ముక్కుకు తగిలితేనే వాంతి వచ్చినంత పనవుతుంది. ఇది ఎవరినీ కించపరచాలని చెప్పట్లేదు. చాలా మందికి ఇలాగే జరుగుతుంటుంది. అలాంటి పేడతోనే దీపావళి పండుగ జరిగిన నాల్గవరోజున.. ఆ ఊరిలో ఒకరినొకరు కొట్టుకుంటారు. కొట్టుకోవడం అంటే.. అలా ఇలా కాదు.. ఊరిమధ్యలో పేడ కుప్ప పెట్టి.. ఒక్కొక్కరు ఒక బండరాయంత పేడను తీసుకుని మరొకరిపైకి విసురుతారు. దీనిని ఒక వేడుకగా జరుపుకోవడం, దాన్ని చూడటానికి వందలాది మంది రావడం.. చాలా వింతగా ఉంది కదూ.

సంక్రాంతికి (Sankranti) జల్లికట్టు పోటీలు జరుపుకునే తమిళనాడులోనే.. ఈ పేడ ఫెస్టివల్ జరుగుతుంది. 300 ఏళ్లుగా ఆ గ్రామంలో ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారట. తలవాడి అనేది ఒక రిమోట్ విలేజ్. ఈరోడ్ జిల్లాలో (Erode District) ఉందీ గ్రామం. దీపావళి పండుగ అయిన తర్వాత సరిగ్గా 4వ రోజున ఆవుపేడతో ఒకరినొకరు కొట్టుకుంటారు. అక్కడున్న బీరేశ్వరర్ (Beereshwarar Temple) ఆలయం ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు.. ఊరి నుంచి పొరుగు ఊళ్లకు వెళ్లినవారంతా వస్తారు. అనేక సంవత్సరాలు ఆలయానికి దగ్గరలో ఉన్న ఒక గొయ్యిలో ఈ సహజ ఎరువును ఉంచి, దానినే వ్యవసాయానికి వాడేవారు. అక్కడ శివలింగం దొరకగా.. దానిని ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు.

అప్పటి నుంచి పేడతో పూర్తయ్యాక.. దానిని గ్రామస్తులకు పంపిణీ చేస్తారు. వారు దానిని వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగిస్తారు. ఇలా చేస్తే.. పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్తుల విశ్వాసం. తమిళనాడులోనే కాదు.. కర్ణాటక - తమిళనాడు సరిహద్దులో ఉన్న గుమతపుర గ్రామంలోనూ ఇలాగే ఒక సంప్రదాయాన్ని ఆచరిస్తారు. అక్కడివారు దానిని గొరెహబ్బ (Gorehabba) అని పిలుస్తారు. అక్కడ కూడా వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. ఏదేమైనా ఇలా పేడతో కొట్టుకోవడం, దాన్ని మళ్లీ ఎరువుగా వాడటం.. వినడానికే కాస్త వింతగానే ఉంది.

Advertisement

Next Story