- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Syria: అలెప్పోను ఆక్రమించిన సాయుధులు.. తొలిసారి ధ్రువీకరించిన సిరియన్ ఆర్మీ
దిశ, నేషనల్ బ్యూరో: సిరియా (Syria)లో మరోసారి అంతర్యుద్ధం మొదలైంది. సాయుధ తిరుగుబాటు దారులు సిరియాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన అలెప్పోపై భారీ దాడిని ప్రారంభించారు. సిటీలోని సగానికి పైగా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులను సిరియన్ ఆర్మీ ధ్రువీకరించింది. తిరుగుబాటు బృందంలో హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS), దాని అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీరికి అల్ ఖైదా మద్దతు కూడా ఉన్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. 2016లో సిరియా సైన్యం ఈ ప్రాంతంలో తిరుగుబాటు దారులను తరిమికొట్టింది. అలెప్పోను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా అధ్యక్షుడు బషర్ అస్సాద్ నగరంపై తన పట్టును సాధించాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఎటువంటి హింస జరగలేదు. తిరిగి 8 ఏళ్ల తర్వాత మరోసారి తిరుగుబాటు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో సిరియా ప్రభుత్వం శనివారం అలెప్పో విమానాశ్రయం, ఆస్పత్రి, నగరానికి అనుసంధానించబడిన అన్ని రహదారులను మూసివేసింది. సిరియాలో మొదలైన అంతర్యుద్ధం బషర్ అల్-అస్సాద్ (Bashar al Assad) ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారనున్నట్టు భావిస్తు్న్నారు.
సిరియాకు రష్యా సాయం!
అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో యుద్ధంలో బిజీగా ఉన్నప్పటికీ రష్యా (Russia) సిరియా ప్రభుత్వానికి సాయం చేసింది. అలెప్పో నగర శివారు ప్రాంతంలోని తిరుగుబాటుదారులపై బాంబు దాడి చేసినట్టు సిరియన్ సైనిక వర్గాలు తెలిపాయి. సాయుధుల గిడ్డంగుల పైన దాడికి పాల్పడినట్టు వెల్లడించాయి. ఈ దాడిలో పలువురు తిరుగుబాటు దారులు మరణించినట్టు తెలుస్తోంది. మిలిటెంట్లను అడ్డుకునేందుకు సిరియాకు అదనపు సైనిక సహాయాన్ని సైతం అందజేస్తామని రష్యా హామీ ఇచ్చింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ తిరుగుబాటుదారులు సిరియా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారని, దానిని తిరిగి పొందడానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మధ్యప్రాచ్యంపై ప్రభావం
ఇప్పటికే హింసాత్మకంగా ఉన్న మధ్యప్రాచ్యాన్ని సిరియా వివాదం మరింత ఘర్షణలోకి నెట్టివేస్తుందనే ఆందోళ సర్వత్రా నెలకొంది. యుద్ధ భయాల కారణంగా సాదారణ పౌరులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎందుంకంటే సిరియాలో తిరుగుబాట్ల కారణంగా ఇప్పటికే అనేక మంది స్థానభ్రంశం చెందారు. ఇంకా అనేక సమస్యలతో అక్కడి పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిరియా మళ్లీ అస్థిరంగా మారితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, 2011లో అసద్ పాలనకు వ్యతిరేకంగా సిరియాలో తిరుగుబాటు మొదలైంది. అప్పటి నుంచి సిరియా సైన్యం, తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలో దేశంలో నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.