- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Syndrome: మహారాష్ట్రలో జీబీఎస్‌తో మరొకరు మృతి.. 192కు చేరిన కేసులు

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో గిలియాన్ బరే సిండ్రోమ్ (GBS) వేగంగా విస్తరిస్తోంది. దీని కారణంగా తాజాగా పూణే(Pune)కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్‌గా పని చేస్తున్న ఆ వ్యక్తికి తీవ్ర నడుము నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారని, కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటుండగా ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి సోమవారం మరణించినట్టు పూణే ఆరోగ్య అధికారులు తెలిపారు. దీంతో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7కు చేరుకుంది. మరోవైపు ఈ వ్యాధి సోకిన అనుమానితుల సంఖ్య 192కు చేరుకోగా వారిలో 167 మంది రోగుల్లో నిర్ధారించినట్టు తెలిపారు. 48 మంది రోగులు ఐసీయులో, 21 మంది వెంటిలేటర్లపై ఉన్నారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 39 మంది పూణే మున్సిపల్ కార్పొరేషన్ (Muncipal carporation)కు చెందినవారు కాగా, 91 మంది పూణే పరిసర గ్రామాల నుంచి ఉన్నారు. అలాగే 29 మంది పింప్రి చించ్వాడ్ (Pimpri chinchwad), 25 మంది పూణే గ్రామీణ ప్రాంతం, 8 మంది ఇతర జిల్లాలకు చెందినవారు ఉన్నారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జీబీఎస్ అనేది అరుదైన నాడీ సంబంధిత పరిస్థితి, దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థలోని ఒక భాగంపై దాడి చేస్తుంది. దీని వల్ల దీని ఫలితంగా కండరాల బలహీనత, కాళ్ళు, చేతులు స్పర్శ కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే నాందేడ్, పరిసర ప్రాంతాల్లో జీబీ సిండ్రోమ్ కలుషిత నీటి వల్ల సంభవిస్తుందని నేషనల్ ఇన్స్‌ట్యిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించింది.