మళ్లీ విజృంభించిన మహమ్మారి.. దేశ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ

by srinivas |   ( Updated:2025-03-11 10:47:07.0  )
మళ్లీ విజృంభించిన మహమ్మారి.. దేశ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: స్వైన్ ఫ్లూ మహమ్మారి(Swine flu) గతంలో చాలా ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. అయితే వైద్యుల దెబ్బకు సైలెంట్ అయింది. అయితే ప్రస్తుతం చాపకింద నీరులా మళ్లీ విజృంభిస్తోంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిలేకపోవడం, గొంతునొప్పి, వాంతులు, విరేచనాల రూపంలో విరుకుపడింది. దీంతో దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. వారందరికీ ఆస్పత్ర పరీక్షలు చేయడంతో స్వైన్ ఫ్లూగా నిర్ధారణ అయింది. ఇలా దేశంలో కొత్తగా 512 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే స్వైన్ ఫ్లూతో ఆరుగురు మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడింది.

దీంతో అన్ని రాష్ట్రాలకు కేందప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. దేశంలో 16 రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తెలిపింది. 8 రాష్ట్రాల్లో మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టం చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీలో స్వైన్ ఫ్లూపై నిఘా పెంచాలని సూచించింది. తమిళనాడులో 209, కర్ణాటకలో 76, కేరళలో 48, జమ్మూ కాశ్మీర్‌లో 41, ఢిల్లీలో 40, పుదుచ్చేరిలో 32, మహారాష్ట్రలో 21, గుజరాత్‌లో 14 కేసులు నమోదయినట్లు వెల్లడించింది. పందుల నుంచి స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపింది.

స్వైన్ ఫ్లూ పట్ల ప్రతి ఒకరూ జాగ్రత్త ఉండాలని సూచించింది. ఎక్కువ రోజులు జలుబు, దగ్గు, జ్వరం ఉంటే పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. స్వైన్ ఫ్లూ సోకిన వారు క్వారంటైన్ కు వెళ్లాలని సూచించింది. అటు వైద్యులకు అలర్ట్ ప్రకటించింది. స్వైన్ ఫ్లూ కేసులకు ప్రత్యేక చికిత్సలు అందించాలని ఆదేశించింది. స్వైన్ ఫ్లూను ఆదిలోనే కట్టడి చేయాలని అలర్ట్ జారీ చేసింది.

కాగా 2019-2020లో కరోనాతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మరణాలు నమోదు అయ్యాయి. ఇటు తెలుగు ప్రజలను కరోనా రక్కసి కాటేసింది. తాజాగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల వైద్యాశాఖలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైద్య చికిత్సలపై పలు సూచనలు చేసింది.

Next Story