Suresh gopi: అంబులెన్స్ దుర్వినియోగం.. కేంద్ర మంత్రి సురేశ్ గోపిపై కేసు

by vinod kumar |
Suresh gopi: అంబులెన్స్ దుర్వినియోగం.. కేంద్ర మంత్రి సురేశ్ గోపిపై కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపి(Suresh gopi)కి షాక్ తగిలింది. అంబులెన్స్‌ను(Ambulance) దుర్వినియోగం చేసినందుకు గాను ఆయనతో పాటు మరో ఇద్దరిపై కేరళ పోలీసులు(kerala Police) తాజాగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోపి, ఇతర వ్యక్తులతో కలిసి ఎన్నికల ప్రచార వ్యూహంలో భాగంగా సేవాభారతి అంబులెన్స్‌లో ప్రయాణించారు. అంతేగాక కేరళలో ప్రసిద్ధి చెందిన త్రిశూర్ ఉత్సవానికి సైతం అంబులెన్స్‌లోనే వచ్చారు. దీంతో ఆయన పోలీసులు ఆంక్షలను ఉల్లంఘించారని, పేషెంట్ల కోసం ఉపయోగించాల్సిన అంబులెన్స్ సర్వీసును దుర్వినియోగం చేశారని సీపీఐ నేత కేపీ సుమేశ్(Kp sumesh) ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు గోపితో సహా, మరో కేంద్ర సహాయ మంత్రి అభిజిత్ నాయర్‌(Abjjith nayar), అంబులెన్స్ డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను సురేష్ గోపీ ఖండించారు. తన కారులోనే ఉత్సవ వేదిక సమీపంలోకి చేరుకున్నానని, ఈ సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కొందరు గూండాలు తనపై దాడి చేశారని చెప్పారు. దీంతో అక్కడున్న యువకులు రక్షించి ఉత్సవ స్థలంలో ఉన్న అంబులెన్స్‌లో కూర్చోబెట్టారని తెలిపారు. ఈ వ్యవహారంపై కేరళ పోలీసులతో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed