Supreme Court: న్యాయమూర్తుల విచారణకు లోక్‌పాల్ ఉత్తర్వులు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

by Shiva |
Supreme Court: న్యాయమూర్తుల విచారణకు లోక్‌పాల్ ఉత్తర్వులు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టు (High Court) జడ్జీలను సైతం విచారించే అధికారం తమకు ఉందని ఇటీవలే లోక్‌పాల్ (Lokpal) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు (Supreme Court) ఇవాళ విచారణ చేపట్టి ఉత్తర్వులపై స్టే విధిస్తూ తీర్పును వెల్లడించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌పాల్ (Lokpal) ఉత్తర్వులు ఉత్తర్వులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం (Central Government)తో పాటు లోక్‌పాల్ రిజిస్ట్రార్‌ (Lokpal Registrar)లకు నోటీసులు కూడా జారీ చేసింది.

అయితే, హైకోర్టు (High Court) సిట్టింగ్ అదనపు జడ్జిపై దాఖలైన రెండు ఫిర్యాదులపై ఇటీవలే లోక్‌పాల్ దర్యాప్తు చేపట్టింది. లోకాయుక్త చట్టం-2013 (Lokayukta Act-2013) ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ జనవరి 27న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు (Supreme Court) ఉత్తర్వులను సుమోటోగా తీసుకుని స్టే విధించింది. విచారణ సందర్భంగా సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బయటకు వెల్లడించొద్దని ఫిర్యాదుదారుడికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Next Story