Supreme court: వీహెచ్‌పీ ప్రోగ్రాంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీంకోర్టు విచారణ

by vinod kumar |
Supreme court: వీహెచ్‌పీ ప్రోగ్రాంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీంకోర్టు విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో: అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ (Shekar kumar Yadav) ఇటీవల చేసిన వివాదాస్పద ప్రసంగంపై సుప్రీంకోర్టు(Supreme court) స్వయంగా స్పందించింది. శేఖర్ కుమార్ ప్రసంగాన్ని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి సమాచారాన్ని కోరినట్టు తెలుస్తోంది. స్పీచ్ కి సంబంధించిన వివరాలను అందించాలని ఆదేశించినట్టు సమాచారం. కాగా, విశ్వహిందూ పరిషత్ (VHP) లీగల్ సెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో శేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఇది హిందుస్థాన్ అని చెప్పడానికి నాకు ఎటువంటి భయం లేదు. ఈ దేశం మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకే నడుస్తుంది. చట్టం కూడా అలాగే పని చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోవాలని సీజేఐ సంజీవ్ ఖన్నాను కోరారు. అలాగే జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్ అనే సంస్థ సైతం సీజేఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణ చేపట్టి హైకోర్టు నుంచి వివరణ కోరింది.

Next Story