Supreme Court: పౌరసత్వ చట్టంలోని ఆ సెక్షన్ ను సమర్థించిన సుప్రీంకోర్టు

by Shamantha N |
Supreme Court: పౌరసత్వ చట్టంలోని ఆ సెక్షన్ ను సమర్థించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్‌ 6ఎ రాజ్యంగ బద్ధతను సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు 4:1 మెజార్టీతో గురువారం తీర్పును వెలువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టగా.. కేవలం జస్టిస్ పార్థీవాలా మాత్రమే రాజ్యాంగ విరుద్ధమని వ్యతిరేకించారు. ఈ కేసుపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. ‘‘అక్రమ వలసలకు అసోం అకార్డ్‌ ఓ రాజకీయ పరిష్కారం. అదే సమయంలో సెక్షన్‌-6ఎ అనేది చట్టబద్ధమైన మార్గం. ఈ నిబంధనలు రూపొందించేందుకు మెజార్టీతో కూడిన పార్లమెంటుకు శక్తి ఉంది. అలానే ఆందోళనలను పరిష్కరించడంతోపాటు.. స్థానికుల ప్రయోజనాలను కాపాడే సమతుల్యత ఈ సెక్షన్‌కు ఉంది. ఇక దీనిలోని కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైనదే. ఎందుకంటే అప్పటికే బంగ్లాదేశ్‌ యుద్ధం ముగిసింది. బంగ్లాదేశ్‌ యుద్ధం నేపథ్యంలోనే ఈ సెక్షన్‌ తీసుకొచ్చిన విషయాన్ని ఇది చెబుతోంది. ఈ సెక్షన్‌ అంత ఎక్కువగా జనాభాను కలుపుకోలేదు.. మరీ తక్కువగాను విలీనం చేసుకోలేదు’’ అని పేర్కొన్నారు.

రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లు

అంతేకాకుండా, పౌరసత్వ చట్టం-1955 సెక్షన్‌6ఎ ప్రకారం.. 1966 జనవరి నుంచి 1971 మార్చి 25లోపు అసోంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చఈ నిబంధనను 1985లో అసోం అకార్డ్‌ తర్వాత తీసుకొచ్చారు. అసోంలోకి బంగ్లాదేశ్‌ వలసలపై ఉద్యమించినవారితో కేంద్రం చేసుకొన్న ఒప్పందమే ఇది.కాగా.. దీని చట్టబద్ధతపై అసోంలోని కొన్ని స్థానిక సంస్థలు కోర్టుని ఆశ్రయించాయి. ఇది రాజ్యాంగ పీఠికకు విరుద్ధమని, పౌర హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నాయి. అయితే, పౌరసత్వ చట్టంలోని సెక్షన్ ఎ ని సమర్థిస్తూ కోర్టు తీర్పిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed