- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sunita Williams: నా బరువు తగ్గలేదు..పెరిగింది: సునీతా విలియమ్స్
దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunitha villiams) ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె భూమి మీదకు చేరుకోవాల్సి ఉండగా పలు సాంకేతిక కారణాల వల్ల అక్కడే ఉండిపోయారు. అయితే ఇటీవల సునీతాకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ కావడంతో ఆమె ఆరోగ్యం క్షీణించినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. ఆమె బరువు తగ్గినట్టు కనిపిస్తోందని తెలిపాయి. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిపై ఐఎస్ఎస్ నుంచి సునీత అప్ డేట్ ఇచ్చారు. తన శరీర బరువులో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశారు. అంతేగాక బరువు మరింత పెరిగానని తెలిపారు. తన ఆరోగ్యం క్షీణించడం లేదని మైక్రోగ్రావిటీ కారణంగా శరీరంలో సాధారణ ఫ్లూయిడ్ షిఫ్ట్‌ల వల్ల మాత్రమే బరువు తగ్గినట్టు కనిపిస్తోందని వెల్లడించారు.
ఈ మేరకు సునీత మాట్లాడిన ఓ వీడియోను ఐఎస్ఎస్ తాజాగా రిలీజ్ చేసింది. తన ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందని, హెల్త్‌ను కాపాడుకోవడానికి అంతరిక్ష కేంద్రంలో చాలా కసరత్తులు చేస్తున్నానని వెల్లడించారు. అంతరిక్షంలో వ్యక్తుల తలలు కొంచెం పెద్దగా కనిపిస్తాయని, ఎందుకంటే ద్రవం శరీరం అంతటా సమానంగా వ్యాపిస్తుందని తెలిపారు. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండటం వల్ల తన తొడలు కొంచెం పెద్దయ్యాయని చెప్పారు. దీని కారణంగా అంతరిక్ష కేంద్రంలో ఎన్నో వ్యాయామాలు చేస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు వ్యోమగాములందరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని నాసా అధికార ప్రతినిధి జిమ్మీ రస్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునితా విలియమ్స్ తిరిగి రానుంది.