- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం
by samatah |
X
దిశ, నేషనల్ బ్యూరో: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, ఇన్ఫోసిస్ మాజీ చైర్ పర్సన్ సుధామూర్తి రాజ్యసభ ఎంపీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పార్లమెంట్ హౌస్‌లోని తన చాంబర్‌లో ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి నారాయణ మూర్తి కూడా హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది.కన్నడ, ఆంగ్ల సాహిత్యానికి సుధామూర్తి ఎంతో కృషి చేశారు. దీంతో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. టెల్కోలో మొదటి మహిళా ఇంజనీర్‌గానూ సుధామూర్తి పని చేశారు. ఆమె కుమార్తె అక్షతా మూర్తి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story