- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Aviation: శ్రీనగర్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు విమానయాన సంస్థల ట్రావెల్ అడ్వైజరీ

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని దృష్టిలో ఉంచుకుని.. స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియాతో సహా పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. పెహల్‌గామ్‌లో జరిగిన విధ్వంసకర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడిన నేపథ్యంలో, చిక్కుకున్న పర్యాటకులకు సహాయం చేసేందుకు విమానయాన సంస్థలు వేగంగా స్పందించాయి. దాడి జరిగిన ప్రాంతం నుంచి ప్రయాణికులను సురక్షిత తరలించేందుకు ఎయిర్ ఇండియా శ్రీనగర్ నుంచి రెండు అదనపు విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఒకటి ఏప్రిల్ 23న ఉదయం 11:30 గంటలకు ఢిల్లీకి, మరొకటి అదేరోజు మధ్యాహ్నం 12:00 గంటలకు ముంబైకి బయలుదేరనుంది. ఇండిగో కూడా అదే రోజున రెండు ప్రత్యేక విమానాలను షెడ్యూల్ చేసింది. ఢిల్లీ, ముంబైలకు ఒక్కొక్కటి చొప్పున నడపనుంది. అలాగే, ఏప్రిల్ 30 వరకు ప్రయాణాల కోసం ఏప్రిల్ 22న లేదా అంతకు ముందు చేసిన బుకింగ్‌ల రీషెడ్యూలింగ్ లేదా క్యాన్సిలేషన్ ఛార్జీలపై రీఫండ్లను ఇస్తామని వెల్లడించాయి. ఏప్రిల్ 30 వరకు రీషెడ్యూలింగ్ లేదా క్యాన్సిలేషన్‌లపై వాపసు చేస్తామని పేర్కొన్నాయి.
ఉగ్రవాద దాడి కారణంగా పెరిగిన భయాందోళల వల్ల విమానాలకు అత్యధిక డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. కొన్ని విమానాల్లో రూ. 65 వేల వరకు టికెట్ ధరలు పెరిగాయి. ఈ పరిణామాలను గమనించిన విమానయాన శాఖ జోక్యం చేసుకుని, ధరలను తగ్గించాలని, సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని ఎయిర్‌లైన్ కంపెనీలకు ఆదేశాలిచ్చింది. ఇందుకు సమాధానంగా విమానయాన సంస్థలు ఛార్జీలు తగ్గించడంతో, అవే రూట్లలో రూ. 14 వేలకు ధరలు చేరాయి. కాగా, ఉగ్రవాద దాడితో పెహల్‌గామ్ అంతటా వందలాది మంది సిబ్బందిని మోహరించారు. ఆ ప్రాంతంలో భద్రతా కార్యకలాపాలు కట్టుదిట్టంగా మారాయి. ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న దాదాపు 100 మంది సానుభూతిపరులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన దౌత్యపరమైన ఒత్తిళ్లకు దారితీయవచ్చు.
Read Also..